Wednesday 15 December 2010

Rudra Ekadashini Stotram 8

कामाह न्नतिलोहितेश्वर हर क्रव्याद राजार्चित
    पूजां बिल्वदलै स्सुमै स्सुरभिलै र्भक्तिव्रती श्रद्धया।
रुद्राध्याय जपार्चनाहुतिविधिं प्रेमादरैः कल्पये
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।    8


kāmāha nnatilōhitēśvara hara kravyāda rājārcita
pūjāṁ bilvadalai s'sumai s'surabhilai rbhaktivratī śrad'dhayā.
rudrādhyāya japārcanāhutividhiṁ prēmādaraiḥ kalpayē
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    8


O slayer of Manmatha! O Lord of the Rudra ganas who are famed as Atilohitas! O Siva Guro, who are ever served by the demon kings! I perform your worship with sincerity and devotion with bilva leaves and fragrant flowers. As stipulated in the scriptures I offer you loving worship with mantras of Sata Rudreeya, with japa and homa.

When I address you as the slayer of Manmatha, I am praying to you to kill the desires in my mind. When I call you the Lord of Atilohita, I am praying that you should also protect my wife, children, parents and relatives. When I refer to you as one who is served by the demon kings, I am praying to you to protect me by burning the Tamo guna that is troubling my mind. I remember you by your names Hara and Atlohita.

8) కామాహ న్నతిలోహితేశ్వర హర క్రవ్యాద రాజార్చిత
పూజాం బిల్వదలై స్సుమై స్సురభిలై ర్భక్తివ్రతీ శ్రద్ధయా।
రుద్రాధ్యాయ జపార్చనాహుతివిధిం ప్రేమాదరైః కల్పయే
దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।   

మన్మథుని నాశనం చేసిన వాడా! అతిలోహితులని ప్రసిద్ధికెక్కిన రుద్రగణానికి ప్రభువైన వాడా! రాక్షస రాజులచేత నిత్యము సేవింపబడిన శివగురో! బిల్వదళాలతోనూ, పరిమళయుక్తములైన పుష్పాలతో నీకు పూజను శ్రద్ధాభక్తులతో చేయుచున్నాను. శతరుద్రీయ మంత్రాలతో జప అర్చన హోమాదులను యథా శాస్త్రముగా ప్రేమానురాగాలతో నీకు అర్పిస్తున్నాను.

కామాహన్న్ (మన్మథుని నాశనం చేసినవాడా) అనుటచే నా యొక్క మనసులోని కోరికలను నాశనం చేయమని ప్రార్ధన. అతిలోహితేశ్వర అనుటచే నా యొక్క భార్యాపుత్రులను, తల్లి తండ్రులను బంధువులను కూడ రక్షించు అని ప్రార్ధన. రాక్షసరాజులచే సేవింపబడు వాడా అనుటచే నా యొక్క మనస్సులోని  తమోగుణములను దహించి నన్ను కాపాడమని నివేదించినట్టు తెలుసుకోవాలి. (ఈవిధముగా ఈ స్తోత్రాలలోని అన్ని సంబోధనలు సమయోచితమైన అర్ధాన్ని సూచిస్తాయి. ఇచట హర, అతిలోహిత అనే నామాలను స్మరిస్తున్నాము.)

No comments: