Saturday 18 December 2010

Rudra Ekadashini Stotram 11

  11
देवं वैद्युत रुद्र मर्ध वनिता देहं भवं भावुकं
विद्युद् वृष्टि दयोपलिप्सु रमित प्रेमादरै र्भावये।
संशुद्धे मम मानसे परतमं त्वां हि प्रतिष्ठापये।
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।


dēvaṁ vaidyuta rudra mardha vanitā
dēhaṁ bhavaṁ bhāvukaṁ
vidyud vr̥ṣṭi dayōpalipsu ramita prēmādarai rbhāvayē.
sanśud'dhē mama mānasē paratamaṁ
tvāṁ hi pratiṣṭhāpayē.
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    11

11.
O Paramesa! I lovingly offer you worship as Ardhanareeswara, Bhava, the Lord of Vaidyuta ganas, and as Devadeva. I need the grace of your divine forms Vidyut and Vrishti for my sins to get destroyed. That is why in every yagna I remember these aspects at the beginning and end. Once the contamination of sins is removed, the mind becomes pure. In a mind that has been thus purified, I establish you who are Paratpara. O Siva Guro, who resides in my heart, please bless me with your Sachchidananda!

11) దేవం వైద్యుత రుద్ర మర్ధ వనితా దేహం భవం భావుకం
విద్యుద్ వృష్టి దయోపలిప్సు రమిత ప్రేమాదరై ర్భావయే।
సంశుద్ధే మమ మానసే పరతమం త్వాం హి ప్రతిష్ఠాపయే।
         దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।

ఓ! పరమేశా! నిన్ను అర్ధనారీశ్వరునిగా, భవునిగా, వైద్యుత గణాధీశునిగా, దేవదేవునిగా, అమితమైన ప్రేమాదరములతో పూజిస్తున్నాను. నా పాపాలు పటాపంచలవ్వాలంటే, విద్యుత్, వృష్టి అనే నీ దేవతా రూపాల దయ కలగాలి. అందువల్లనే ప్రతి యజ్ఞములోనూ ప్రారంభ, సమాప్తులలో ఈ స్మరణ చేస్తారు.
ఇలా నా పాప కల్మషాలు తొలగిపోతే, మనస్సు శుద్ధమవుతుంది. అటువంటి పరిశుద్ధమైన నా యొక్క మనస్సులో పరాత్పరుడవైన నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను. నా ఎదలో నెలకొని ఉన్న, శివగురో! నీ యొక్క సచ్చిదానందత్వాన్ని నాకు అనుగ్రహించు స్వామీ.

No comments: