Tuesday 7 December 2010

Rudra Ekadashini Stotram 5

5.
भर्गं देव मिहेडयामि परुषं रुद्रं भवन्तं मुदा
भ्रज्जस्वात्र महाघ सञ्चिति मपि प्रारब्ध माशुप्रमुत्।
ध्यायेहं भवदीय चित्र चरितं दक्षाध्वर ध्वंसक
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।    
 

bhargaṁ dēva mihēḍayāmi paruṣaṁ rudraṁ bhavantaṁ mudā
bhrajjasvātra mahāgha sañciti mapi prārabdha māśupramut.
dhyāyēhaṁ bhavadīya citra caritaṁ dakṣādhvara dhvansaka
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    5


O Siva Guru! I joyously praise you as Rudra and Bharga. I have others praise you also. You are Bhola Sankara who will at once make one happy. With your form as Parusha, kindly destroy my Sins of all the three categories of Prarabdha, Agami, and Sanchita.  
(Effects of the three types - 1) Grand Accumulated past, 2) Future and 3) Compulsorily scheduled for this birth).
I forever meditate upon your wondrous episodes, your marvelous acts and the manner in which you destroyed the Yaga of Daksha.
(Bharjana literally, is to fry. We are asking Lord to fry the negative deeds)
In this verse the names Bharga and Parusha are remembered.



5) భర్గం దేవ మిహేడయామి పరుషం రుద్రం భవన్తం ముదా
            భ్రజ్జస్వాత్ర మహాఘ సఞ్చితి మపి ప్రారబ్ధ మాశుప్రముత్।
ధ్యాయేహం భవదీయ చిత్ర చరితం దక్షాధ్వర ధ్వంసక
      దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।   

హే శివగురో! నిన్ను రుద్రునిగా భర్గునిగా ఎల్లప్పుడూ సంతోషంతో స్తుతిస్తున్నాను. పరులచే కూడ స్తోత్రం చేయిస్తున్నాను. భోళాశంకరుడవై వెంటనే సంతోషపెట్టగల నీవు, నా యొక్క ప్రారబ్ధ - ఆగామి - సంచిత మైన పాపసమూహాన్ని నీ యొక్క పరుషమైన రూపంతో నాశనం చేయాలి. చిత్ర విచిత్రమైన నీ యొక్క చరిత్రను, లీలా విలాసాదులను దక్షుని యాగాన్ని ధ్వంసం చేసిన విధానాన్ని స్మరిస్తూ నిన్ను ధ్యానిస్తూనే ఉన్నాను.
(భర్జనం అంటే మంటలో వేయించడం. మన దుష్కర్మలను వేయించమని ప్రార్థన).
    ఈ శ్లోకములో భర్గ, పరుష అనే నామాలను స్మరిస్తున్నాము.

Om Namasshivaaya

To be continued ......

No comments: