Sunday, 26 December 2010

Role Parents' behaviour food patterns in the conception of the foetus


Environmental influences, including diet, that a father experiences can be transmitted to his offspring, 'reprogramming' the latter's genes.

A study has thrown up new evidence that environmental cues influence genes in mammals from one generation to the next.


These insights, coupled with previous human studies, suggest that paternal environmental effects may play a more important role in complex diseases such as diabetes and heart disease than previously believed, the journal Cell reports.


'Knowing what your parents were doing before you were conceived is turning out to be important in determining what disease risk factors you may be carrying,' said chief study investigator Oliver J. Rando, according to a University of Massachusetts statement.

Rando is an associate professor of biochemistry and molecular pharmacology at the University of Massachusetts Medical School in the US.


The human genome is often described as the set of instructions that govern the development and functioning of life.


'A major and underappreciated aspect of what is transmitted from parent to child is ancestral environment,' said Rando. 'Our findings suggest there are many ways that parents can 'tell' their children things.'


Rando and colleagues fed different diets to two groups of male mice. The first group received a standard diet, while the second received a low-protein diet.


The researchers observed that the offspring of the mice which was fed the low-protein diet exhibited a marked increase in the genes responsible for lipid and cholesterol synthesis in comparison to offspring of the control group fed the standard diet.

Wednesday, 22 December 2010

Chocolate's Theobromine might be the clue to treat Persistent Cough

This is the season of common colds.

Chocolate could provide the key to tackling a persistent cough.

Researchers are carrying out the final stages of clinical trials on a drug that contains theobromine, an ingredient in cocoa and chocolate.

If the trials are successful, the drug could be on the market within two years. Millions worldwide suffer from a persistent cough, one that lasts for more than two weeks.
Some have asthma-like symptoms while others suffer from heartburn, reports the Daily Mail.

But most widely available cough products soothe the symptoms rather than deal with the cause, and have been criticised for side effects such as drowsiness.

There are safety concerns about side effects from other products that are codeine-based, which use a chemical called an opioid.

Previous research by London's National Heart and Lung Institute found that theobromine is 33 per cent more effective than codeine at stopping coughing. It works directly on the vagus nerve, which is responsible for persistent coughing.

Research in South Korea has shown that theobromine has none of the side effects associated with standard drug treatments for persistent cough.

The professor Mr Alyn Morice, who heads the Hull Cough Clinic, said: "Due to the drawbacks of current opioid drugs such as codeine, we are in desperate need of a non-opioid treatment with a drastically improved side effect profile for patients."

http://en.wikipedia.org/wiki/Chocolate
 

Sunday, 19 December 2010

Rudra Ekadashini Stotram 12 Conclusion

फलश्रुतिः
सदभीष्टप्रदा मेतां शिवप्रीतिकरां शुभाम्।
रुद्रैकादशिनीं जप्त्वा शिवसायुज्य माप्नुयात्।
अतिरुद्र यागः 2010 कार्तिकमासः
वंशीकृष्ण घनपाठी, अवधूत दत्त पीठम्, मैसूरु


phalaśrutiḥ
sadabhīṣṭapradā mētāṁ śivaprītikarāṁ śubhām.
rudraikādaśinīṁ japtvā śivasāyujya māpnuyāt.

Atirudra yāgaḥ 2010 kārtikamāsaḥ
Vamshi Krishna Ghanapāṭhī, Avadhūta Datta Peeṭham, Mysore

Phala Shruti:
Whoever continuously chants this Rudra Ekadasini Stotram which bestows all good things, which fulfills desires, and which pleases Lord Siva, will obtain oneness with Lord Siva.
Om NamasShivaaya

ఫలశ్రుతి
     సదభీష్టప్రదా మేతాం శివప్రీతికరాం శుభామ్।
     రుద్రైకాదశినీం జప్త్వా శివసాయుజ్య మాప్నుయాత్।
   
శ్రేయస్సును కలిగించే మంచి కోరికలను తీర్చేదీ, శివుడికి ప్రీతిని కలిగించేదీ, శుభకరమైన, ఈ రుద్రైకాదశినీ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో, వారు శివసాయుజ్యాన్ని పొందుతారు.
శుభమస్తు.
ఓం నమశ్శివాయ
------------------------------------------
Courtesy - Few Photos from www.dattapeetham.com
Telugu Text Illustration: Dr. RS Deekshitulu
English Text Illustration: Smt. Hira Duvvuri
Well Wishes and Support - Veda Nidhi Team Mates.
Design, Commentary, Photos: VKG
Subham

Saturday, 18 December 2010

Rudra Ekadashini Stotram 11

  11
देवं वैद्युत रुद्र मर्ध वनिता देहं भवं भावुकं
विद्युद् वृष्टि दयोपलिप्सु रमित प्रेमादरै र्भावये।
संशुद्धे मम मानसे परतमं त्वां हि प्रतिष्ठापये।
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।


dēvaṁ vaidyuta rudra mardha vanitā
dēhaṁ bhavaṁ bhāvukaṁ
vidyud vr̥ṣṭi dayōpalipsu ramita prēmādarai rbhāvayē.
sanśud'dhē mama mānasē paratamaṁ
tvāṁ hi pratiṣṭhāpayē.
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    11

11.
O Paramesa! I lovingly offer you worship as Ardhanareeswara, Bhava, the Lord of Vaidyuta ganas, and as Devadeva. I need the grace of your divine forms Vidyut and Vrishti for my sins to get destroyed. That is why in every yagna I remember these aspects at the beginning and end. Once the contamination of sins is removed, the mind becomes pure. In a mind that has been thus purified, I establish you who are Paratpara. O Siva Guro, who resides in my heart, please bless me with your Sachchidananda!

11) దేవం వైద్యుత రుద్ర మర్ధ వనితా దేహం భవం భావుకం
విద్యుద్ వృష్టి దయోపలిప్సు రమిత ప్రేమాదరై ర్భావయే।
సంశుద్ధే మమ మానసే పరతమం త్వాం హి ప్రతిష్ఠాపయే।
         దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।

ఓ! పరమేశా! నిన్ను అర్ధనారీశ్వరునిగా, భవునిగా, వైద్యుత గణాధీశునిగా, దేవదేవునిగా, అమితమైన ప్రేమాదరములతో పూజిస్తున్నాను. నా పాపాలు పటాపంచలవ్వాలంటే, విద్యుత్, వృష్టి అనే నీ దేవతా రూపాల దయ కలగాలి. అందువల్లనే ప్రతి యజ్ఞములోనూ ప్రారంభ, సమాప్తులలో ఈ స్మరణ చేస్తారు.
ఇలా నా పాప కల్మషాలు తొలగిపోతే, మనస్సు శుద్ధమవుతుంది. అటువంటి పరిశుద్ధమైన నా యొక్క మనస్సులో పరాత్పరుడవైన నిన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను. నా ఎదలో నెలకొని ఉన్న, శివగురో! నీ యొక్క సచ్చిదానందత్వాన్ని నాకు అనుగ్రహించు స్వామీ.

Friday, 17 December 2010

Rudra Ekadashini Stotram 10

10
संसेव्योवपतन्त रुद्र महिमा नित्यं कपाली यदि
तापानां त्रितयस्य सेवनमिदं नेष्येत चिन्ताकुलैः।
संव्यावर्तयितुं स्मरामि तदतो नित्यं विभो त्वां भवन्
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।    10


samsēvyō vapatanta rudra mahimā nityaṁ kapālī yadi
tāpānāṁ tritayasya sēvanamidaṁ nēṣyēta cintākulaiḥ.
sanvyāva rtayituṁ smarāmi tadatō
nityam vibhō tvāṁ bhavan
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    10

10.
Kapali! O Rudra, the Lord of the Avapatanta ganas! Your glory is to be praised. Humans and other living beings are troubled by Adhyatmika, Adhibhoutika, and Adhidaivika difficulties (diseases, injuries, natural calamities, curses, and such). Unable to withstand their onslaught, they become dejected. In order to avoid those, you are our only refuge. We have to only worship you, O Paramesa! Hence I constantly remember you. Here the names Avapatanta and Kapali are mentioned. By the contemplation of these names and forms, the difficulties will be removed.

10) సంసేవ్యో(అ)వపతన్త రుద్ర మహిమా నిత్యం కపాలీ యది
      తాపానాం త్రితయస్య సేవనమిదం నేష్యేత చిన్తాకులైః।
సంవ్యావ ర్తయితుం స్మరామి తదతో నిత్యం విభో త్వాం భవన్
   దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।    


కపాలీ! అవపతన్త గణాధీశుడవైన రుద్రుడా! నీ యొక్క మహిమ సేవింపతగినది. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపములు మనుషులకు తదితర జీవులకు చాలా దుఃఖాన్ని కష్టాన్ని కలిగిస్తాయి. దానికి వారు ఇష్టపడక చింతాగ్రస్తులవుతారు. వాటిని తప్పించుట కొరకై పరమేశా! నిన్నే సేవించాలి.  అందువల్ల స్వామీ, నేను నిన్ను నిరంతరం స్మరిస్తున్నాను.
ఇచట అవపతంత, కపాలి అనే నామాలను స్మరిస్తున్నాము. ఈ నామరూపాల వల్ల తాపత్రయాలు తొలగిపోతాయని భావము.

Thursday, 16 December 2010

Rudra Ekadashini Stotram 9

9
शर्वं रुद्र मिहोर्ध्व नामक महं ध्यायामि यस्य प्रभा
सूर्याचन्द्रमसौ कृशानु मरुतो दिक्पालकान् लोकपान्। 
ऐश्वर्येण समस्त पालक गणं सञ्चालयन्ती सना।
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।    9



śarvaṁ rudra mihōrdhva nāmaka mahaṁ
dhyāyāmi yasya prabhā
sūryācandramasau kr̥śānu marutō dikpālakān lōkapān. 
aiśvaryēṇa samasta pālaka gaṇaṁ sañcālayantī sanā.
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    9

9.
I meditate upon you who are known by the names Sarva and Urdhva. It is your divine brilliance that gives wealth, radiance, and ability to the Sun, the Moon, the seven Marut ganas, and the Dikpalakas who are Lokapalakas. I contemplate upon you, O Siva Guro! In your aspect as Urdhva, you rule the higher realms and their rulers. I worship you here with your names Sarva and Urdhva.

9) శర్వం రుద్ర మిహోర్ధ్వ నామక మహం ధ్యాయామి యస్య ప్రభా
   సూర్యాచన్ద్రమసౌ కృశాను మరుతో దిక్పాలకాన్ లోకపాన్। 
ఐశ్వర్యేణ సమస్త పాలక గణం సఞ్చాలయన్తీ సనా।
   దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్। 
  
శర్వుని, ఊర్ధ్వనామకుడైన నీ రుద్రరూపాన్ని ధ్యానిస్తున్నాను. దివ్యమైన నీయొక్క తేజస్సే సూర్యచంద్రులను, అగ్నిహోత్రుని, సప్త మరుద్గణాలను, లోకపాలకులైన దిక్పాలకులను, అష్టైశ్వర్యవంతులుగా, ప్రకాశవంతులుగా సమర్థులుగా చేస్తోంది. అటి శివగురువును ధ్యానిస్తున్నాను. ఊర్ధ్వ అనే అంశతో స్వామి పై లోకాలనూ, వాటి అధిపతులను నడుపుతున్నాడు అని భావము.
ఇచట శర్వ, ఊర్ధ్వ అనే నామాలను స్మరిస్తున్నాము.

Wednesday, 15 December 2010

Rudra Ekadashini Stotram 8

कामाह न्नतिलोहितेश्वर हर क्रव्याद राजार्चित
    पूजां बिल्वदलै स्सुमै स्सुरभिलै र्भक्तिव्रती श्रद्धया।
रुद्राध्याय जपार्चनाहुतिविधिं प्रेमादरैः कल्पये
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।    8


kāmāha nnatilōhitēśvara hara kravyāda rājārcita
pūjāṁ bilvadalai s'sumai s'surabhilai rbhaktivratī śrad'dhayā.
rudrādhyāya japārcanāhutividhiṁ prēmādaraiḥ kalpayē
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    8


O slayer of Manmatha! O Lord of the Rudra ganas who are famed as Atilohitas! O Siva Guro, who are ever served by the demon kings! I perform your worship with sincerity and devotion with bilva leaves and fragrant flowers. As stipulated in the scriptures I offer you loving worship with mantras of Sata Rudreeya, with japa and homa.

When I address you as the slayer of Manmatha, I am praying to you to kill the desires in my mind. When I call you the Lord of Atilohita, I am praying that you should also protect my wife, children, parents and relatives. When I refer to you as one who is served by the demon kings, I am praying to you to protect me by burning the Tamo guna that is troubling my mind. I remember you by your names Hara and Atlohita.

8) కామాహ న్నతిలోహితేశ్వర హర క్రవ్యాద రాజార్చిత
పూజాం బిల్వదలై స్సుమై స్సురభిలై ర్భక్తివ్రతీ శ్రద్ధయా।
రుద్రాధ్యాయ జపార్చనాహుతివిధిం ప్రేమాదరైః కల్పయే
దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।   

మన్మథుని నాశనం చేసిన వాడా! అతిలోహితులని ప్రసిద్ధికెక్కిన రుద్రగణానికి ప్రభువైన వాడా! రాక్షస రాజులచేత నిత్యము సేవింపబడిన శివగురో! బిల్వదళాలతోనూ, పరిమళయుక్తములైన పుష్పాలతో నీకు పూజను శ్రద్ధాభక్తులతో చేయుచున్నాను. శతరుద్రీయ మంత్రాలతో జప అర్చన హోమాదులను యథా శాస్త్రముగా ప్రేమానురాగాలతో నీకు అర్పిస్తున్నాను.

కామాహన్న్ (మన్మథుని నాశనం చేసినవాడా) అనుటచే నా యొక్క మనసులోని కోరికలను నాశనం చేయమని ప్రార్ధన. అతిలోహితేశ్వర అనుటచే నా యొక్క భార్యాపుత్రులను, తల్లి తండ్రులను బంధువులను కూడ రక్షించు అని ప్రార్ధన. రాక్షసరాజులచే సేవింపబడు వాడా అనుటచే నా యొక్క మనస్సులోని  తమోగుణములను దహించి నన్ను కాపాడమని నివేదించినట్టు తెలుసుకోవాలి. (ఈవిధముగా ఈ స్తోత్రాలలోని అన్ని సంబోధనలు సమయోచితమైన అర్ధాన్ని సూచిస్తాయి. ఇచట హర, అతిలోహిత అనే నామాలను స్మరిస్తున్నాము.)

Monday, 13 December 2010

Rudra Ekadashini Stotram 7

स्वामिन् भो शिव देव रुद्र कपिल प्रश्नं ममैकं वद
यैषा चित्र विचित्र सत्त्व जगती त्वन्मूर्ति रेवेरिता।
किन्त्वस्यां भवदीय मक्षय सुखं न न्यासि का ते घृणा?
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।

   
svāmin bhō śiva dēva rudra kapila praśnaṁ mamaikaṁ vada
yaiṣā citra vicitra sattva jagatī tvanmūrti rēvēritā. 
kintvasyāṁ bhavadīya makṣaya sukhaṁ na n'yāsi 
kā tē ghr̥ṇā?
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.

O Swami! Siva! Rudra! Kapila! Please answer my question. 
The Vedas proclaim that this Creation which is filled with ever strange forms of virtuous attributes is your form.
If that is so, then why have you not furnished this Creation which is of your form with permanent bliss? 
Why have you been oblivious to this factor? 
It is all right if you do not answer my question. 
But please O Lord, grant me the experience of your principle of Sachchidananda. 
Here the names Siva and Kapila are contemplated upon.
 
7) స్వామిన్ భో శివ దేవ రుద్ర కపిల ప్రశ్నం మమైకం వద
  యైషా చిత్ర విచిత్ర సత్త్వ జగతీ త్వన్మూర్తి రేవేరితా।
కిన్త్వస్యాం భవదీయ మక్షయ సుఖం న న్యాసి కా తే ఘృణా?
దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్। 7
 ఓ! స్వామీ! శివ! రుద్ర! కపిలరూపుడా! నా యొక్క ప్రశ్నకు సమాధానం  చెప్పు. చిత్ర విచిత్రాలతో వివిధ స్వభావాలతో, ఉండే ఈ జగత్తు నీ యొక్క రూపమనే కదా వేదాలు చెప్తున్నాయి. మరి, నీ యొక్క రూపమైన ఈ జగత్తులో నాశనము లేని నీవనుభవించే అనంతమైన సుఖాన్ని నీవు ఎందులకు ఉంచలేదు? ఈ విషయములో నీకెందుకింత ఉపేక్ష? నీ కరుణ అనంతమంటారు. మరి ఇక్కడ కనబడదే నీ కరుణ?
నా ప్రశ్నకు సమాధానము చెప్పకపోయినా పరవా లేదు. 
నీ సచ్చిదానంద తత్త్వాన్ని మాత్రం నాకు అనుగ్రహించు స్వామీ.

ఇచట శివ, కపిల అనే నామాలను స్మరిస్తున్నాము.
 

Om Namasshivaaya
 To be continued ....

Thursday, 9 December 2010

Rudra Ekadashini Stotram 6

6
श्यामं रुद्र विभुं सदाशिव महं सञ्चिन्तये त्वां सदा
शान्तं दान्तं मभिष्टुतोस्मि निरतं षाड्गुण्य रायं दिश।
त्वन्नामामृत पान मत्त मधुपो बोभोमि गौरीपते
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।   

śyāmaṁ rudra vibhuṁ sadāśiva mahaṁ sañcintayē tvāṁ sadā
śāntaṁ dāntaṁ mabhiṣṭutōsmi nirataṁ ṣāḍguṇya rāyaṁ diśa.
tvannāmāmr̥ta pāna matta madhupō bōbhōmi gaurīpatē
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām. 6

6.
O Rudra! Sadasiva! I constantly think of you who are the Lord of this entire Creation consisting of moving and non-moving beings. 
I praise your peaceful and noble personality. 
I desire from you the wealth consisting of the six virtues of Shama, Dama, Uparati, Titiksha, Shraddha and Samaadhana.
O Consort of Gouri! I am intoxicated by consuming to my heart’s content the nectar of your divine names. Here I am dwelling on your names Sadasiva and Shyamaa.


శ్యామం రుద్ర విభుం సదాశివ మహం సఞ్చిన్తయే త్వాం సదా
శాన్తం దాన్తం మభిష్టుతోస్మి నిరతం షాడ్గుణ్య రాయం దిశ।
త్వన్నామామృత పాన మత్త మధుపో బోభోమి గౌరీపతే
దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।


చరాచరజగత్తునకు ప్రభువైన ఓ రుద్రా! సదాశివా! నేను ఎల్లవేళల నిన్ను ధ్యానిస్తున్నాను. 
స్వామీ - శాన్త, దాన్త స్వరూపాన్ని స్తుతిస్తున్నాను. 
శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానములు అనే, షడ్గుణ సంపత్తిని నీ నుండి నేను కోరుచున్నాను. 
హే గౌరీనాథా! నీ యొక్క నామామృతాన్ని తనివితీరా త్రాగి మత్తెక్కిన తుమ్మెద వలె ఉంటున్నాను. 
ఇచట సదాశివ, శ్యామ అనే నామాలను స్మరిస్తున్నాను.
Om Namasshivaaya

To be continued ..

Tuesday, 7 December 2010

Rudra Ekadashini Stotram 5

5.
भर्गं देव मिहेडयामि परुषं रुद्रं भवन्तं मुदा
भ्रज्जस्वात्र महाघ सञ्चिति मपि प्रारब्ध माशुप्रमुत्।
ध्यायेहं भवदीय चित्र चरितं दक्षाध्वर ध्वंसक
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।    
 

bhargaṁ dēva mihēḍayāmi paruṣaṁ rudraṁ bhavantaṁ mudā
bhrajjasvātra mahāgha sañciti mapi prārabdha māśupramut.
dhyāyēhaṁ bhavadīya citra caritaṁ dakṣādhvara dhvansaka
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    5


O Siva Guru! I joyously praise you as Rudra and Bharga. I have others praise you also. You are Bhola Sankara who will at once make one happy. With your form as Parusha, kindly destroy my Sins of all the three categories of Prarabdha, Agami, and Sanchita.  
(Effects of the three types - 1) Grand Accumulated past, 2) Future and 3) Compulsorily scheduled for this birth).
I forever meditate upon your wondrous episodes, your marvelous acts and the manner in which you destroyed the Yaga of Daksha.
(Bharjana literally, is to fry. We are asking Lord to fry the negative deeds)
In this verse the names Bharga and Parusha are remembered.



5) భర్గం దేవ మిహేడయామి పరుషం రుద్రం భవన్తం ముదా
            భ్రజ్జస్వాత్ర మహాఘ సఞ్చితి మపి ప్రారబ్ధ మాశుప్రముత్।
ధ్యాయేహం భవదీయ చిత్ర చరితం దక్షాధ్వర ధ్వంసక
      దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।   

హే శివగురో! నిన్ను రుద్రునిగా భర్గునిగా ఎల్లప్పుడూ సంతోషంతో స్తుతిస్తున్నాను. పరులచే కూడ స్తోత్రం చేయిస్తున్నాను. భోళాశంకరుడవై వెంటనే సంతోషపెట్టగల నీవు, నా యొక్క ప్రారబ్ధ - ఆగామి - సంచిత మైన పాపసమూహాన్ని నీ యొక్క పరుషమైన రూపంతో నాశనం చేయాలి. చిత్ర విచిత్రమైన నీ యొక్క చరిత్రను, లీలా విలాసాదులను దక్షుని యాగాన్ని ధ్వంసం చేసిన విధానాన్ని స్మరిస్తూ నిన్ను ధ్యానిస్తూనే ఉన్నాను.
(భర్జనం అంటే మంటలో వేయించడం. మన దుష్కర్మలను వేయించమని ప్రార్థన).
    ఈ శ్లోకములో భర్గ, పరుష అనే నామాలను స్మరిస్తున్నాము.

Om Namasshivaaya

To be continued ......

Monday, 6 December 2010

Rudra Ekadashini Stotram 4

4
स्थाणुत्वे जडता रजोमयगुणः कार्यक्रमारम्भणे
त्यक्त्वेमा वथ संवसेय मधुना सत्त्वैक मार्गानुगः।
संगृह्याक्ष मनो मया हि रजते रुद्रे त्वयि न्यस्यते
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।
 

sthāṇutvē jaḍatā rajōmayaguṇaḥ kāryakramārambhaṇē
tyaktvēmā vatha sanvasēya madhunā sattvaika mārgānugaḥ.
saṅgr̥hyākṣa manō mayā hi rajatē rudrē tvayi n'yasyatē
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.    4

 
A quandary is often faced by those seekers in the path of spirituality.
One who lives like a motionless log, oblivious to the happenings around, (unaffected by anything) is called Jada. This denotes Tamo guna. One who effectively completes all duties has the desire to embark on new projects. That denotes Rajo guna. Both of them are contradictory to each. 
After, analysis, I will give up both Rajo and Tamo gunas. 
Of the three gunas I desire only Satva guna. 
Accordingly, I control my mind along with the sensory organs and thereafter, I orient it towards, Rudra who is also known as RAJATA and STHAANU (white as silver).
(the word ‘aksha’ here refers to the sense organs). 
In this verse the names Sthanu and Rajata are contemplated upon.

 స్థాణుత్వే జడతా రజోమయగుణః కార్యక్రమారమ్భణే
త్యక్త్వేమా వథ సంవసేయ మధునా సత్త్వైక మార్గానుగః।
సంగృహ్యాక్ష మనో మయా హి రజతే రుద్రే త్వయి న్యస్యతే
 దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।
   
ఆధ్యాత్మిక మార్గ సాధనలో ఉన్నవారికి తరచుగా కలిగే గందరగోళము ఒకటి ఉన్నది.
స్థాణువులా (దుంగలా, ఏమీ పట్టకుండా) జీవిస్తే జడుడు అంటారు. ఇది తమోగుణ లక్షణం. 
అన్ని పనులను సక్రమంగా పూర్తి చేస్తే మళ్ళీ కొత్త పనులు మొదలు పెట్టబుద్ధి కలుగుతుంది. మళ్ళీ కొత్త పనులను చేస్తూ నిమగ్నమై పోతాను. అందులో రజోగుణ దోషం కనిపిస్తుంది. 
ఈ విధంగా నిశితంగా పరిశీలించిన తరువాత, నేను రజస్తమో గుణాలను విడిచి పెట్టేస్తాను. (సత్త్వరజస్తమో) గుణాలలో సత్త్వగుణమార్గాన్ని మాత్రమే ఇష్టపడుతున్నాను.
ఇలా నిశ్చయించుకున్నాక, నా యొక్క ఇంద్రియాలతో పాటుగా, మనస్సును నిగ్రహించి, 
ఎల్లవేళలా రజత స్వరూపుడైన రుద్రుని యందు మాత్రమే ప్రవర్తింపచేస్తున్నాను. 
(అక్షశబ్దం ఇంద్రియాలకు సంకేతం.) 
ఈ శ్లోకములో స్థాణు, రజత అనే రుద్రనామాలను స్మరిస్తున్నాము.

Om Namasshivaaya

To be continued ......

Friday, 3 December 2010

Rudra Ekadashini Stotram 3

  3
वन्दे वासुकि वैद्युताख्य गिरिशं नित्यं शयानं गिरौ
    सर्वस्मिन्नपि साक्षिमात्र मजरं कूटस्थ मीहातिगम्।
अक्षय्यं प्रमुदा भजामि मनसा त्वामेव सप्रश्रयो
    दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।
 
    vandē vāsuki vaidyutākhya giriśaṁ nityaṁ śayānaṁ girau
sarvasminnapi sākṣimātra majaraṁ  kūṭastha mīhātigam.
akṣayyaṁ pramudā bhajāmi manasā tvāmēva sapraśrayō
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.

I humbly worship with deep devotion and attention Lord Parameswara 
who is known by the names VasukiVaidyuta and Girisa. 
Girisa is he who not only resides on Mount Kailas or Himalayas;
but in reality He is the Conscious Witness to the entire Creation. He has no desires. 
He is indestructible, and is the manifestation of unfragmented bliss.

 వన్దే వాసుకి వైద్యుతాఖ్య గిరిశం నిత్యం శయానం గిరౌ
సర్వస్మిన్నపి సాక్షిమాత్ర మజరం కూటస్థ మీహాతిగమ్।
అక్షయ్యం ప్రముదా భజామి మనసా త్వామేవ సప్రశ్రయో
దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।


గిరిశ, వాసుకి వైద్యుత అనేవి స్వామివారి మూడవ నామాలు. గిరిశ అనగా కైలాసపర్వతం మీద లేక హిమాలయాలలోనూ, ఇతర పర్వతాలపై నివసించు వాడు. వాస్తవానికి అంతరార్థమేమిటంటే, సమస్తమైన జగత్తుకు సాక్షిమాత్ర చైతన్యమై  సకల జీవులలోనూ స్థిరముగా ఉండేవాడు. ఏ కోరికలూ లేనివాడు,  నాశనము లేని అఖండ ఆనందరూపమే తానయిన పరమేశ్వరుని వినయవిధేయతలతోనూ, భక్తిశ్రద్ధలు నిండిన మనస్సుతో సేవించుచున్నాను.
 
Om Namasshivaaya

To be continued ...

Wednesday, 1 December 2010

Rudra Ekadashini Stotram 2

2
सर्वेशान पिनाकिन स्रिपुरसं हर्तुः कृपा वीक्षया
     द्वैधीभाव विपत्तय स्सपदि मे ग्लायन्तु शोकास्पदाः।
सेवेहं व्यवदात रुद्र मनिशं त्वां वेदवेद्यं विभुं   
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।  
sarvēśāna pinākina sripurasaṁ hartuḥ kr̥pā vīkṣayā
dvaidhībhāva vipattaya s'sapadi mē glāyantu śōkāspadāḥ.
sēvēhaṁ vyavadāta rudra maniśaṁ tvāṁ vēdavēdyaṁ vibhuṁ       
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.  

By the compassionate glance of the lord of this ever moving Creation, the one who holds in His hand the bow called Pinaka, the slayer of the Tripurasuras, the dualities of the mind that cause misery are destroyed. I constantly worship Parama Siva who instantaneously fulfills desires, who is fair, radiant, and is a knower of the Vedas. I remember His names Vyavadata, and Pinaki.
2) సర్వేశాన పినాకిన స్త్రిపుర సం హర్తుః కృపా వీక్షయా
  ద్వైధీభావ విపత్తయ స్సపది మే గ్లాయన్తు శోకాస్పదాః।
   సేవేహం వ్యవదాత రుద్ర మనిశం త్వాం వేదవేద్యం విభుం
  దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।।

స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచమునకు ప్రభువు, త్రిపురాసురులను సంహరించిన వాడు, పినాకము అనే ధనుస్సును చేతియందు కలిగిన పరమశివుని యొక్క దయామయమైన చూపువల్ల, శోకమునకు కారణమైన, మనసులోని ద్వంద్వ ప్రకృతులు నాశమవుగాక. కోరిన కోరికలను వెను వెంటనే తీర్చు స్వభావముగలవాడు, తెల్లని శరీరకాంతి గల వేదవేద్యుడైన పరమశివుడిని నిరంతరం సేవించుచున్నాను. ఆయనయొక్క వ్యవదాత, పినాకి అనే నామాలను తలుస్తున్నాను.
 
Om Namasshivaaya

To be continued ....

Tuesday, 30 November 2010

Rudra Ekadashini Stotram 1



 शम्भो शाश्वत सर्वकामद महा मायाधिनाथ प्रिय

     भक्ताभीष्ट ददान सर्व सदय प्रभ्राजमान प्रभो।

स्वात्मज्ञान विभूति मुत्तम रयिं देहि प्रसिद्धां तव

दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।  1


śambhō śāśvata sarvakāmada mahā māyādhinātha priya
bhaktābhīṣṭa dadāna sarva sadaya prabhrājamāna prabhō.
svātmajñāna vibhūti muttama rayi dēhi prasid'dhā tava
dadyā paramēśa śivagurō tvatsaccidānandatām.           1.

O Lord Sambho! You grant all auspiciousness and eternal liberation! You are the overlord of Illusion, Maha Maya. You fulfill the desires of your dear devotees. You are ever effulgent. O Parama Siva, kindly grant me the most exalted, the highest, and the most precious wealth which is Atma Jnana or Self Realization.
The refrain: O Parameswara, Siva Guro! Please bless me with the experience of Sachchidananda which is your exclusive principle.
The first shloka remembers the Lord in His aspects as Sambhu and Prabhrajamana, the first two names.


1) శమ్భో శాశ్వత సర్వకామద మహా మాయాధినాథ ప్రియ
   భక్తాభీష్ట దదాన సర్వ సదయ ప్రభ్రాజమాన ప్రభో
   స్వాత్మజ్ఞాన విభూతి ముత్తమ రయిం దేహి ప్రసిద్ధాం తవ
 దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్।।
సర్వశుభాలను అనుగ్రహించు శంభో! శాశ్వతమైన మోక్షమును ఇచ్చువాడా! మహామాయకు అధినాయకుడా! ప్రియమైన భక్తులయొక్క కోరికలను తీర్చువాడా! నిరంతరం ప్రకాశించే స్వభావం కల పరమశివా! సుప్రసిద్ధమైనదీ, అత్యుత్తమమైన ఆత్మజ్ఞానమనే మహదైశ్వర్యాన్ని నాకు అనుగ్రహించు.
! పరమేశ్వరా! శివగురో! నీకు సంబంధించినదీ, నీ దగ్గర మాత్రమే గల సచ్చిదానంద తత్త్వాన్ని నాకు అనుగ్రహించు (అని భక్తుడు ప్రాధేయపడుతున్నాడు. ఇది ప్రతిశ్లోకములోనూ చివరికి వచ్చే ముకుటమునకు అర్థము). మొదటి శ్లోకములో స్వామియొక్క శంభు, ప్రభ్రాజమాన - మొదటి నామాలను స్మరిస్తున్నాము.
  Om Namasshivaaya
To be continued ...