Sunday, 31 January 2010

Fight fat with carboxy therapy

 

Carbondioxide is often blamed for global warming, but medically it is used to treat obesity. Treatment through carbondioxide or CO2 gas is known as as carboxy therapy. Carboxy therapy can trace its origins back to Royat, France. There, a group of cardiologists began to treat patients suffering from blood vessel disorders (atherosclerotic, Buerger’s disease, Raynaud’s disease, etc) with carboxy therapy. This treatment is all about the therapeutic use of carbondioxide gas administered into the skin.

Today, carboxy therapy is one of the best therapies to fight cellulite, excess body fat, flabbiness, and corporal and facial ageing. It is approved by the FDA, USA and European Community.
The best part about this is that it is a non-surgical method. Carboxy therapy is performed by using special equipment and carbondioxide is injected subcutaneously (into the skin) with a sterile thin needle similar to the ones used for insulin injections. CO2 works on the affected zone and is rapidly eliminated. The equipment allows regulating the speed of the CO2 flow, time of injection, and monitors the percentage of the administered dose.

How does the carbon dioxide work?
At the injection site, the CO2 penetrates in the form of gas and is easily spread to other tissues nearby, and keeps on doing its work by producing lypolisis (destruction of fat cells).

Carboxytherapy works in three complimentary ways. First, and quite simply, carbondioxide mechanically kills fat cells, by breaking off their membranes. Secondly, it also has a strong vasodilatory effect (causes widening of blood vessels) in the area. It also increases the percentage of oxygen in the tissue. Wider vessels mean bigger and stronger blood flow to the area. The increase in oxygen is important because it eliminates the built up fluid from between the cells. Thirdly, it improves the cutaneous elasticity, and induces a rejuvenation of the dermis.


Results can be seen immediately, the tissue improves, the skin is smoother and the affected zones become thinner. This way, cellulite is treated effectively and blood circulation is also improved. The end result is fewer fat cells and firmer subcutaneous tissue.

However, it is not useful in treating morbid obesity and intra abdominal fat. The procedure is not painful. Some patients can experience a light tingling sensation near the injection site. It disappears within a matter of seconds. As a result of the increased circulation, the area surrounding the injection site may feel warmer for 10 to 20 minutes. There are no restrictions on any activities after the treatment but one should avoid submerging in water for next four hours.

 

Written by

Dr Nandakishore Dukkipati,  Head of the department of bariatrics, Apollo Hospitals, Hyderabad

Friday, 22 January 2010

Surya Stava _ Shat Chakra

షట్చక్రాన్తర్వర్తి సూర్య భావనా
శ్లో।। ఆధారే తు చతుర్దళేరుణమయే వాసాంత వర్ణాన్వితే
తిష్ఠన్తం గణనాథ రూపిణ మహం శ్రీ భాస్కరం సర్వదా।
హంసానాం శతకఞ్చ షట్పరిమితం భక్త్యార్పయా మ్యాదరా
దజ్ఞానాంధ తమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణమ్।। 1

శ్లో।। స్వాధిష్ఠాన సరోరుహే సువిమలే సౌదామినీ సన్నిభే
షట్ సంఖ్యాక దళై ర్యుతేబరమణిం బాలాన్త వర్ణాన్వితే।
షట్ సాహస్ర మహం సమర్ప్య మనసా బ్రహ్మాత్మకం హంసమి
త్యజ్ఞానాంధ తమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణమ్।। 2

శ్లో।। శ్రీమద్రత్న మయాంబుజే దశదళోపేతే డఫాన్తాక్షరై
ర్యుక్తే శ్రీ మణిపూరకాఖ్య సదనే శ్రీ విష్ణు రూపం రవిమ్।
షట్ సాహస్ర జపం సమర్ప్య మనసా హంసాత్మకం సాదరా
దజ్ఞానాంధ తమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణమ్।। 3

శ్లో।। సౌవర్ణే సరసీరుహే కఠ యుతే ద్వే షడ్దళేనాహతే
చక్రే శ్రీమదుమేశ రూప మమలం శ్రీ భాస్కరం సర్వదా।
షట్ సాహస్ర మనుం సమర్ప్య మనసా హంసాత్మకం సాదరా
దజ్ఞానాంధ తమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణమ్।। 4

శ్లో।। శ్రీమచ్ఛారద చంద్రసన్నిభ రుచౌ శ్రీమద్విశుధ్ధాంబుజే
పత్త్రై ష్షోడశభి స్స్వరైశ్చ సహితే జీవాత్మ రూపం రవిమ్।
ధ్యాత్వాహం మనసార్పయామి పరమం హంసం చ సాహస్రకం
అజ్ఞానాంధ తమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణమ్।। 5

శ్లో।। హక్షే త్యక్షర సంయుతే మణినిభే ద్వేపత్రయుక్తే సదా
జ్ఞాచక్రాన్తరగం పరాత్పర గురో రూపం రవిం శ్రీకరమ్।
సాహస్రం తు జపాజపాత్మ విధినా భక్త్యార్పయా మ్యాదరా
దజ్ఞానాంధ తమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణమ్।। 6

శ్లో।। ఉద్య ద్దివ్య నిశాకరాచ్ఛ సదృశే సాహస్రపత్రాంబుజే
ఆది క్షాన్త సమస్త వర్ణ నిధయే సాక్షాత్పరేశాత్మకమ్।
హంసాన్ లక్ష జపాజపై రభిహితాన్ శ్రద్ధా సమర్ప్యానమూన్
అజ్ఞానాంధ తమోపహం హృది భజే శ్రీ సూర్యనారాయణమ్।। 7

శ్లో।। ఏవం చ సప్తభి శ్శ్లోకై స్స్తవనం సర్వసిద్ధిదమ్।
యః పఠేత్ భావయేన్నిత్యం సూర్యరూప స్స జాయతే।। 8

శ్లో।। మార్తాండం భాను మాదిత్యం హంసం సూర్యం దివాకరమ్।
తపనం భాస్కరం వన్దే సర్వలోకైక చక్షుషమ్।। 9

Sunday, 17 January 2010

జ్యోతిర్లింగము

- వంశీకృష్ణ ఘనపాఠీ

ఓం నమశ్శివాయ।

“నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః” అనే వాక్యం మనకు శతరుద్రీయంలో వినిపిస్తున్నది. శతరుద్రీయం అంటే అనేక రకాలైనటువంటి రుద్రులకు సంబంధించినటువంటి స్తోత్రము అని అర్థం. అనేకము అంటే ఎంత? ఏకము కానిది అనేకము. ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి అని. ఈ అద్భుతమైనటువంటి ప్రతిపాదన మనకు “విరూప” అనే ఒక పదంలో లభిస్తుంది. మొట్టమొదట ఎటువంటి స్వగత, పరగత, సజాతీయ, విజాతీయ, భేదాలూ లేకుండా, అఖండంగా శుద్ధ – ముక్త- బుద్ధ పరిపూర్ణంగా ఉండేదే నిర్గుణబ్రహ్మ. దానినే పరంబ్రహ్మ అనికూడా పిలుస్తారు.

అటువంటి పరబ్రహ్మ, మాయ యొక్క సంసర్గంవల్ల, కలయిక వల్ల, అనేక రకాలుగా విస్తరించాలి అనుకున్నది. ఇదే ఉపనిషత్తు వాక్యాలలో చెపుతున్నది, “తదైక్షత, బహుస్యాం ప్రజాయేయ”, అనేక రకాలుగా నేను విస్తరింతునుగాక. అనేక రకాలుగా కనబడుదునుగాక – ఈ సంకల్పం ఎపుడైతే కలుగుతున్నదో, అప్పుడు ఏకత్వమునుండి అనేకత్వంగా కనబడింది. అందువల్ల ఈ అనేక అనే పదంవల్ల చాలా విశేషం ఉన్నది. ఒకటి కంటే ఎక్కువ అంటే ఎన్ని కోట్లైనా అవచ్చు, అనంతమైనా అవచ్చు. వాస్తవానికి ఉండేటటువంటిది ఒకటే.

ఇక్కడ “విరూపేభ్యః” అనే పదంవల్ల మనకు రెండు అర్థాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, “విగతాని రూపాణి యేషాం తే విరూపాః” అని. అంటే ఎటువంటి రూపము లేకుండా ఉండటం. ఎప్పుడైతే అనేక రకాలుగా తనను తాను కనపడేటట్లుగా చేస్తున్నదో, అప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మ సగుణంగా మారుతున్నది. అప్పుడు విరూప అనే పదానికి రెండవ అర్థం చెప్పుకోవాలి. “వివిధాని రూపాణి యేషాం తే విరూపాః.” అనేక రకాలైన, రకరకాలైన రూపాలు కలిగినది అని. అందువల్ల పై నామమే “విశ్వరూపాః”. ఆ విధంగా విస్తరించినప్పుడు, విశ్వమంతటి రూపాలు కూడా తానే అయి ఉంటున్నదన్నమాట. అందువల్ల నిరాకారంగా భగవంతుడిని భావన చేయాలి అనే సంప్రదాయాన్ని జ్ఞానులు అవలంబిస్తారు.

సాక్షాత్తుగా, నిరాకారమైనటువంటి నిర్గుణ బ్రహ్మను, నిర్వికల్పంగా భావన చేయటం, సాధనయొక్క ప్రారంభ స్థాయిలో కష్టం అవుతుంది. ఈ అభిప్రాయంతోనే, భక్తులకు, ఆసక్తులకు, ఆస్తికులకు, జిజ్ఞాసువులైన మనకు పరమాత్మ తత్వం స్పష్టంగా అర్థమయ్యేందుకే పెద్దలు ఒక వ్యవస్థను ఏర్పరిచారు. అందరూ శివోపాసన చెయ్యాలి. విష్ణువును భావించేవారు కూడ సాలగ్రామార్చన చేయాలి అనే నిరాకార ఆరాధనా పద్ధతిని ప్రారంభం చేయించారు. అందువల్లే, ఉపాసకులందరూ, (అన్నీ విడిచి పెట్టిన సన్న్యాసులతో సహా) శతరుద్రీయ పారాయణ , లింగానికి అభిషేకము చేస్తారు.

శివలింగాన్ని మనం పరిశీలించినప్పుడు, ఎటువంటి ఆకారాలు కూడా శివలింగంలో ఉండవు. అయినప్పటికినీ, ఆ శివలింగాన్ని ఒక ఆకారం కలిగిన మూర్తిగా మనం మొట్టమొదట, ఆరాధన చేస్తుంటాం. ఆ లింగానికే కవచాలు, అలంకారాలు, పెడతాం.

అయితే అలా ప్రారంభమైన ఆరాధనా భావన పెంపొందినపుడు, ఉపాసనయొక్క పరమావధి అందినప్పుడు, నిరాకారమైనటువంటి పరబ్రహ్మకు లింగమే ఈ శివలింగము అని మనకు అర్థం అవుతుంది. ఈ విధంగా శివుడి యొక్క ఉపాసన, అభిషేకం, అర్చనలు లోకమంతా జరుగుతూనే ఉన్నాయి.

ఇన్ని రకాలుగా శివారాధన జరుగుతున్నప్పటికినీ కూడా, ఈ లింగము కొన్నిచోట్ల ప్రత్యేకముగా,. విశేషముగా కనబడుతున్నదని మన పురాణాలు మనకు ప్రబోధిస్తున్నాయి. వీటినే “జ్యోతిర్లింగాలు” అంటారు. జ్యోతిస్సు అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి నిర్గుణ పరబ్రహ్మ యొక్క అఖండమైన ప్రకాశము. మరి అఖండంగా జ్యోతి ఉన్నట్లైతే, ఈ పన్నెండు చోట్ల అంటున్నారేమిటి? ఈ పన్నెండు సంఖ్య ఎక్కడనుండి వచ్చినది? ఆ జ్యోతిస్సు పన్నెండు రకాలుగానే ఎందుకు మనకు కనబడాలి? అనే సందేహం మనకు సహజంగానే కలుగుతుంది. దీనికీ వేదమే సమాధానం చెప్పింది. “ఆదిత్యో జ్యోతిషాం జ్యోతి రుత్తమమ్”, అని.

సూర్యుడు అనే జ్యోతి అన్నిరకాలైన జ్యోతిస్సులకు కూడా జ్యోతిస్సు. సూర్యకాంతి వల్లే ప్రపంచంలోని ఇతర కాంతులన్నీ మనకు కనబడుతున్నాయి. చంద్రాది గోళాలతో సహా మనకు అన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా “అగన్మ జ్యోతి రుత్తమమ్”, అనే వేదవాక్యం కూడా మనకు దీనినే ప్రతిపాదిస్తున్నది. అటువంటి ఉత్తమమైనటువంటి జ్యోతి సూర్యుడు. ఆయన స్వయం ప్రకాశమానుడు. ఆ సూర్యుడు, అనేక రూపాలను స్వీకరిస్తున్నప్పుడు, పన్నెండు రకాలైనటువంటి ఆదిత్యమండలాలుగా కూడా గుర్తించారు. అవే మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవితృ అర్క భాస్కర అనే పన్నెండు రకాలైన రూపాలు. అలా ప్రతిపాదించినప్పుడు, ద్వాదశాదిత్యుడిగా ఆయన కొలవబడుతున్నాడు.

ఈ విధంగా నిరాకారమైనటువంటి పరబ్రహ్మకు శివలింగము ఒక ప్రతీక అయితే, అఖండమైనటువంటి ఆ ప్రకాశానికి, స్వయం ప్రకాశానికి చిహ్నం సూర్యుడు. అందువల్లే నిత్యం సంధ్యావందనం చేసేటటువంటివారు, “అసౌ ఆదిత్యః పరం బ్రహ్మ” అనే ఉపాసన చేస్తూ, ఈ హృదయంలో, (ఈ జీవిలో) ఉండేటటువంటివాడు, ఆ పైన కనబడే మండలంలో ఉండేవాడూ ఒకడే మెళకువను మనకు నేర్పిస్తున్నారు.

ఒకవైపు సూర్యుడిని పరబ్రహ్మకు సంకేతమని చెబుతూ, మరొకవైపు నిరాకారమైనటువంటి శివలింగాన్ని కూడా ఆ పరబ్రహ్మకే సంకేతమంటున్నారు. కాబట్టి, ఈ రెండిటి సమన్వయంగా మనకు పురాణాలద్వారా మహర్షులూ, దేవతలు బోధించినవే “ద్వాదశ జ్యోతిర్లింగాలు.” ఇవి అనేక సందర్భాలలో స్వయంగా ఆవిర్భవించాయి.

వాస్తవానికి లింగము అనే పదానికి, నిదర్శనమని హేతువని, ఒక దృష్టాంతమని మూడు రకాలైన అర్థాలున్నాయి. జ్యోతిర్లింగము అంటే, స్వయంప్రకాశమైనటువంటి జ్యోతిస్సుతో కూడినటువంటి ఆ పరబ్రహ్మకు ఒక నిదర్శనంగా మనకు లభిస్తున్నటువంటిది అని అర్థం.

అటువంటి జ్యోతిర్లింగాలన్నిటినీ కూడా ఎవరైతే దర్శనం చేయాలనుకుంటారో, వారికి ఆత్మసాక్షాత్కారమే పరమార్థము. ఈ జ్యోతిర్లింగ యాత్ర యొక్క ప్రధానమైనలక్ష్యం, ఆత్మసాక్షాత్కారం. ఆ స్థాయికి మనను తీసుకు వెళ్ళాలి అంటే, ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలయొక్క భావనను మనస్సులో చేయాలి. అందువల్ల సూర్య, శివ ఉపాసనల సంబంధాన్ని మనకు చాలా సూక్ష్మంగా బోధించేది వైదిక యాజ్ఞిక పరంపర.

“శతరుద్రీయం హవనం ”(రుద్రయాగం) అనే విధానాన్ని మనకు బోధించిన వాడు బోధాయన మహర్షి. ఆ బోధాయన మహర్షి తన యొక్క కల్పంలో, ఉద్దేశ్యత్యాగం చెప్పవలసినప్పుడు, ఆదిత్యాత్మకాయ శ్రీరుద్రాయేదన్నమమ అని చెప్పాలన్నారు. ఆదిత్య స్వరూపంతో ఉన్న శ్రీరుద్రుడికి ఈ ఆహుతి చెందుగాక అని దీని భావం. అందువల్లే పురోహితులు, ఈ విధమైన వాక్యాన్ని (ఉద్దేశ్య త్యాగాన్ని) మనతో చెప్పిస్తారు. ఇటువంటి వాక్యోచ్చారణ బోధాయన మహర్షి యొక్క అభిప్రాయంలోని స్వారస్యాన్ని బోధిస్తున్నది.

పరంబ్రహ్మయొక్క రెండు చిహ్నాలను సమన్వయం చేస్తే, తద్ద్వారా, మనయొక్క హోమం కానీ, పారాయణలు కానీ, జపాలు గానీ, క్షేత్ర దర్శనాలు గానీ, అభిషేకాదులు కానీ, ఒకే తత్త్వాన్ని బోధిస్తున్నాయి. అందువల్ల ఆచారాలను, సంప్రదాయాలను సమన్వయం చేసుకోవాలి. ఆ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను మనసారా భావన చేసినప్పుడు, మనకు పరమార్థం ఖాయంగా సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని అనేకమంది మహాత్ములు తమయొక్క అనుభవాలనే ప్రాతిపదికగా చేసుకుని బోధిస్తున్నారు. అటువంటి మహనీయులలో, శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అగ్రగణ్యులు.

ద్వాదశ జ్యోతిర్లింగాలకు, ఆ క్షేత్రం యొక్క చరిత్రలను పురాణచరిత్రలతో సహా మనకు బోధిస్తున్నటువంటి, అద్భుతమైన కీర్తనలను, శ్రీ స్వామీజీ మనకు అందజేశారు. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క కథలతో పాటుగా, వాటి మహత్త్వాన్ని, “జ్యోతిర్లింగాకారా ద్వాదశరూపా పరమశివా” అనే వాక్యాల ద్వారా స్వామీజీ మనకు బోధిస్తున్నారు.

ప్రస్తుతం స్వామీజీవారి యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క వివరణను మనస్సులో ఉంచుకుని, వాటితో పాటుగా భక్తులు ఆ క్షేత్రాలకు (భౌతికంగా) ఏ విధంగా చేరుకోవాలి? అక్కడ మనం చేయవలసిన తీర్థ, క్షేత్ర విధులు ఏమిటి? ఇటీవలి చరిత్ర చెప్పే విషయాలేమిటి అనే పలు అంశాలను మనకు బోధించేందుకు, దత్తపీఠ పండితులు, బ్రహ్మశ్రీ రాజ్ఞీ సుబ్బయ్యదీక్షితులు పూనుకున్నారు. ఆ చిరు గ్రంథమే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం.

ఈ గ్రంథం సాధకులకు, యాత్రికులకు, భక్తులకు చాలా ఉపకారం చేస్తుంది, అని మనసారా విశ్వసిస్తూ, శివాత్మకంగా ప్రపంచమంతా అనుభూతమవుగాక. స్వస్తి

జ్యోతీరూపో లింగమూర్తి ర్వవిభుస్సన్

క్షేత్రే క్షేత్రే భావ్యతే సౌ మయోభూః।

మాయా మోహాపీడితోద్ధార హేతు

ర్యాత్రాయాం స్వం తత్త్వమావిష్కరోతు ।।

మయోభూః అంటే ఎల్లప్పుడూ సుఖంగా ఉండేవాడు, దుఃఖస్పర్శ ఏ కోశానా లేని వాడు. ఆయన సర్వవ్యాపకుడు అద్వితీయుడు కాబట్టే, అటువంటి శాశ్వతమైన ఆనందస్వరూపంతో ఉన్నాడు. తన ప్రతీకగా జ్యోతిస్సునూ, లింగాన్ని ఎంచుకున్న, ఆ పరమేశ్వరుడు ప్రతి క్షేత్రములోనూ భక్తులందరిచేత భావించబడుతున్నాడు. ఈ భావనవల్లే, ఆ భక్తుల మాయ, మోహము, వాటి వల్ల కలిగి పీడ తొలగిపోతున్నాయి.

ఆ స్వామి జీవనయాత్రలోనూ, తీర్థయాత్ర లోనూ, యాత్రకు వెళ్ళేవారికీ, వెళదామనుకునేవారికీ (యాత్రికులందరికీ) తన నిజ తత్త్వాన్ని ఆవిష్కరించుగాక। మంగళం మహత్।।

Tuesday, 5 January 2010

'Self-drive' cars! – A reality in this decade??

Imagine owning a car that does all the driving while you sit back and relax. Your fantasy seems to be getting closer to reality, thanks to scientists who are designing such a "self-drive" vehicle.

A European team claims to be working on such a fantasy car which can drive itself - in fact, tests would start next year on such vehicles that "drive themselves" and could be on roads within 10 years, 'The Daily Telegraph' reported.

Co-ordinated by a UK company, the European Union project is called Safe Road Trains for the Environment and it involves a "carpooling" roadtrain theory for use on motorways.

The roadtrain would consist of six to eight vehicles whose occupants would be able to relax, read the paper or chat on mobiles while travelling; this'll be possible as their cars would be equipped with a navigation system and a transmitter unit that communicates with the lead vehicle, say scientists.

This lead vehicle - possibly a taxi a bus or a truck - will drive "normally" and effectively "do the motoring" for the rest of the roadtrain.

Drivers approaching their destination will take over control of their own vehicle, leave the convoy by exiting off to the side and then continue on their own to their respective destinations, according to the scientists.